తెలుగు స్టార్ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చాలా కాలంగా బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తుంది సుమ కనకాల. ఆమె.. తాజాగా ‘జయమ్మ పంచాయితీ’ సినిమాతో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చింది. విజయ్ కలివారపు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా నేడు(శుక్రవారం)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటి నుంచి సినిమాల్లోనూ నటిస్తానని స్వయంగా సుమ పేర్కొన్న సంగతి తెలిసిందే.
దీంతో యాంకరింగ్‌కు ఫుల్స్టాప్ పెట్టేస్తుందా అన్న అనుమానాలు రేకెత్తాయి. తాజాగా ఈ విషయంపై సుమ స్పందించింది. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమ మాట్లాడుతూ.. బుల్లితెరను వదిలే ఛాన్సే లేదని తేల్చి చెప్పింది. తనకు అన్నం పెట్టిన బుల్లితెర తల్లితో సమానమని, వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. సినిమాలతో పాటు బుల్లితెరపై కంటిన్యూ అవుతానని వెల్లడించింది.