టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ తన సొంత నిర్మాణ సంస్థ ‘సుకుమార్ రైటింగ్స్’లో సినిమాలు తెరకెక్కిస్తున విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆయన మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మించిన ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ నిర్మాణ సంస్థకు సంబంధించి ఈ దర్శకుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ రైటింగ్స్ బాధ్యతలు తన భార్య తబితకు అప్పగించినట్లుగా సమాచారం. ఇది వరకు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌కు సంబంధించిన విషయాలన్నీ ఆయన స్నేహితుడు, మేనేజర్ ప్రసాద్ చూసుకునేవారు.
అయితే ఆయన కొద్ది రోజలు క్రితం గుండెపోటుతో మరణించారు. దీంతో ఆ బాధ్యతల్ని ఇప్పుడు భార్య తబితకు సుకుమార్ అప్పగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన సూచనలతో తబిత కంపెనీ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్‌తో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. బన్నీ-సుకుమార్ కాంబినేషన్లో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం సుకుమార్ రైటింగ్స్ నిఖిల్ హీరోగా ’18 పేజెస్’ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.