HomeTelugu Big Storiesనేను శిష్యుడినైపోయాను.. సుకుమార్‌ భావోద్వేగ పోస్ట్

నేను శిష్యుడినైపోయాను.. సుకుమార్‌ భావోద్వేగ పోస్ట్

Sukumar emotional post on U
వైష్ణ‌వ్‌తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్‌లుగా నటించిన ‘ఉప్పెన’ మూవీ క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుండ‌టంతో దర్శకుడు బుచ్చిబాబుతోపాటు అత‌డి గురువు, డైరెక్ట‌ర్ సుకుమార్ ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇప్ప‌టికే కేక్ క‌ట్ చేసి స‌క్సెస్ ను సెల‌బ్రేట్ చేసుకున్నారు గురుశిష్యులు. బుచ్చిబాబును ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తిన సుకుమార్ తాజాగా భావోద్వేగ పోస్ట్ పెట్ట‌డంతో అది వైర‌ల్ అవుతోంది.

‘నువ్వు న‌న్ను గురువు చేసేస‌రికి నాకు నేను శిష్యుడినైపోయాను. ఇంత గొప్ప సినిమా తీయ‌డానికి నువ్వు నా ద‌గ్గ‌ర ఏం నేర్చుకున్నావా..? అని..నాకు నేను శిష్యుడినైపోతే త‌ప్ప అదేంటో తెలుసుకోలేను. నాలోకి న‌న్ను అన్వేషించుకునేలా చేసిన సా’నా’ బుచ్చిబాబును ‘ఉప్పెన’త ప్రేమ‌తో అభినందిస్తూ..ఇట్లు సుకుమార్ ఇంకో శిష్యుడు సుకుమార్..’ అంటూ పెట్టిన పోస్టు అంద‌రి మ‌న‌సుకు హ‌త్తుకుంటోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu