Sukumar – Allu Arjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. తాజాగా ఇప్పుడు పుష్ప సినిమాకి రెండవ భాగం ఆయన పుష్ప 2 త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతోంది. పుష్ప సినిమా 2021 డిసెంబర్ లో విడుదలైంది. తెలుగులో మాత్రమే కాక అన్ని భాషల్లో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లు అందుకున్న సంగతి తెలిసిందే.
ఆ సినిమా విడుదలై ఇప్పటికీ మూడేళ్లు గడుస్తోంది కానీ ఇంకా పుష్ప రెండవ భాగం మాత్రం విడుదల కి సిద్ధం కాలేదు. ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడి డిసెంబర్ 6న విడుదల కి సిద్ధం అవుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే అప్పుడు కూడా సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
ఇంకా 30 రోజుల షూటింగ్ పెండింగ్ లోనే ఉంది. అల్లు అర్జున్ ఒకేసారి షూటింగ్ పూర్తి చేయడానికి రెడీగానే ఉన్నారట. కానీ సుకుమార్ మాత్రం షూటింగ్ లేట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కోపం తెచ్చుకున్న బన్నీ షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకొని తన కుటుంబంతో ఇప్పుడు వెకేషన్ కి వెళ్లారు.
షూటింగ్ విషయంలో ఇంకా ఎలాంటి ఇ క్లారిటీ లేకపోవడంతో.. చిరాకు తెచ్చుకున్న అల్లు అర్జున్ తన గడ్డం కూడా ట్రిమ్ చేసుకున్నారు. నిజానికి పుష్ప 2 సినిమా లేట్ అవుతుంది అనే అట్లీతో సినిమా కూడా క్యాన్సిల్ చేసుకున్నారు బన్నీ. అయినా సరే పుష్ప 2 షూటింగ్ మాత్రం పూర్తకపోవడంతో అల్లు అర్జున్ కి కోపం వచ్చినట్లు తెలుస్తోంది.
మరి అల్లు అర్జున్ ఎప్పుడూ తిరిగి వచ్చి సినిమా షూటింగ్ మొదలు పెడతాడో వేచి చూడాలి. అంతేకాకుండా అనుకున్న తేదీకి సినిమా విడుదల అవుతుందో లేదో కూడా తెలియకపోవడంతో అభిమానులు కూడా నిరాశ చెందుతున్నారు.