సుకుమార్ డైరెక్టర్ తనకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపు సంపాదించుకున్నాడు. రచయితగా తన శిష్యులకు కథలు ఇస్తుంటారు. కొన్ని సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరిస్తుంటారు. అలా తెరకెక్కిందే ‘కుమారి 21 ఎఫ్’. తాజాగా సుకుమార్ మరోసారి ఆ తరహా ప్రయత్నం చేయబోతున్నాడు. ఓటీటీ ట్రెండ్‌ను ఫాలో అవుతూ… కథలు సిద్ధం చేశాడట సుకుమార్. త్వరలోనే ‘ఆహా’ ఓటీటీ యాప్ కోసం వాటిని వెబ్ సిరీస్‌గా తెరకెక్కిస్తాడట.
ఓటీటీ కోసం సుకుమార్ తొమ్మిది ప్రేమకథలు సిద్ధం చేశారట. అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన ‘మోడరన్ లవ్’ తరహాలో సుక్కు ప్రేమకథలు ఉంటాయని తెలుస్తోంది. ఓ అంతర్జాతీయ నవల ఆధారంగా సుకుమార్ ఈ ప్రేమకథలు రాసుకున్నాడని తెలుస్తోంది. సుటీమ్ ఇప్పటికే వాటిని మన నేటివిటీకి తగ్గట్టుగా మార్చి సిద్ధం చేశాయి. అందులో ఓ రెండు కథలకు ఆయన దర్శకత్వం వహించనుండగా.. మిగిలిన వాటికి సుకుమార్ సన్నిహితులు, యువ దర్శకులు తెరకెక్కిస్తారు. ‘పుష్ప’ చిత్రీకరణ మొదలయ్యేముందే ఈ వెబ్‌సిరీస్ పని పూర్తి చేస్తారట. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.