దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి తన టాలెంట్‌తో ఔరా అనిపిస్తోంది. జనవరి 11న సుకుమార్ 50వ పుట్టినరోజు జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సుకుమార్ కుమార్తె సుకృతి ఆయన కోసం ఓ పాట పాడి తన తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. అయితే నేడు సుకృతి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ట్విటర్ వేదికగా పాటకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ‘డార్లింగ్ డైరెక్టర్ సుకుమార్ ముద్దుల కుమార్తె సుకృతికి పుట్టినరోజు శుభాంకాంక్షలు. తండ్రి పుట్టినరోజు కోసం తాను పాడిన పాటను.. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తున్నాం. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను’ అని దేవిశ్రీ పేర్కొన్నారు.
మరోవైపు సుకృతి టాలెంట్ చూసి నెటిజన్లు ఔరా అని కామెంట్లు పెడుతున్నారు. సుకృతిలో మంచి ప్రతిభ ఉందని పేర్కొన్నారు. ‘నైస్ వాయిస్’, ‘అమేజింగ్ వాయిస్’, ‘సో బ్యూటీఫుల్’, ‘చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ’ అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్ బన్నీ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే
Happiest Musical Bday 2 this Super Talented Little Angel, Sukriti Sukumar, d darling Daughter of our Darling Director Dear @aryasukku
Here’s a Song she sang 4 her DAD’s Bday..
but We r presenting it on HER Bday..Hope U wil all love & Bless her ❤️🎶🙏🏻https://t.co/95lHQ4Bg1Z
— DEVI SRI PRASAD (@ThisIsDSP) January 22, 2020