సుహాస్‌ ‘కేబుల్‌ రెడ్డి’ ఫస్ట్‌లుక్‌

నటుడు సుహాస్‌ ‘కలర్‌ ఫోటో’ సినిమాతో హీరోగా మారి.. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్‌ సాధించాడు. కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు టాలీవుడ్‌ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇక ఇటీవలే రైటర్‌ పద్మభూషణ్‌ తో థియేటర్‌ హిట్టును కొట్టేశాడు.

ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక ప్రస్తుతం సుహాస్‌ చేతిలో మూడు, నాలుగు సినిమాలున్నాయి. అందులో కేబుల్‌ రెడ్డి ఒకటి. తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

ఈ విష‌యాన్ని తెలుపుతూ.. కేబుల్‌ రెడ్డి నవ్వులతో మీ గుండెకి కనెక్షన్ ఇచ్చేస్తాడు అంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ సినిమాకి సుహాస్ స్నేహితుడు శ్రీధర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో సుహాస్ సరసన షాలిని కొండేపూడి నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను 2024 స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu