Love Stories on OTT:
ఓటీటీ లో చాలానే ప్రేమ కథలు చూస్తాం కానీ కొన్ని మాత్రమే మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి. అలాంటిదే ఒక సినిమా పద్మిని. యూత్ కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉండే సినిమా ఇది. ప్రేమ, పెళ్లి లాంటి కన్ఫ్యూషన్ లో ఉన్న వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? పద్మిని. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.
సినిమా కథ గురించి చెప్పాలంటే.. రమేషన్ అనే ఒక వ్యక్తి.. కాలేజ్ లో లెక్చరర్ గా పని చేస్తూ ఉంటాడు. 30 ఏళ్ళు వచ్చినా కూడా.. పెళ్లి కాలేదని అందరూ అంటున్న సమయంలో తనకి.. స్మృతి అనే అమ్మాయితో పెళ్లి కుదురుతుంది. అనుకున్నట్టుగానే వారిద్దరికీ వైభవంగా పెళ్లి కూడా జరుగుతుంది. కానీ వారి ఫస్ట్ నైట్ రోజు.. స్మృతి రమేషన్ తో కాస్త మంచిగా మాట్లాడి.. అతనిని బయటకు తీసుకుని వెళ్తుంది. అక్కడే ట్విస్ట్ ఇస్తుంది. సిజ్జు అనే అబ్బాయిని ప్రేమించానని చెప్పి.. అతనితో వెళ్ళిపోతుంది. రమేషన్ ఏమీ చేయలేక అలా షాక్ లో చూస్తూ ఉండిపోతాడు. కానీ ఇదంతా చూసిన కొందరు ఊరంతా ఈ వార్త చెప్పేస్తారు. అలా భర్త తో పాటే తన పరువు కూడా పోతుంది.
కట్ చేస్తే రమేషన్ అదే ఊరిలో లయ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ ఈ విషయాన్ని బయటకి చెప్పడు. కానీ ఒకరోజు రమేషన్ కి తన తమ్ముడు రాహుల్, లయ ప్రేమించుకున్నారు అనే విషయం తెలుస్తుంది.
ఇలా విసిగిపోయిన రమేషన్ తెలిసిన మ్యారేజ్ ద్వారా శ్రీ దేవి అనే అమ్మాయిని కలుస్తాడు. కానీ అక్కడ ఆమెతో గొడవ జరుగుతుంది. అసలు రమేషన్ కు మళ్ళీ పెళ్ళి అవుతుందా లేదా.. రమేషన్ ను అందరూ ఎందుకు పద్మిని అని పిలుస్తారు? శ్రీదేవి తో ఎందుకు గొడవ జరుగుతుంది? చివరికి ఏమైంది అని తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. ఇంకా ఈ సినిమా చూడకపోతే వెంటనే చూసేయండి.