సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన అల్లుడు.. యంగ్ హీరో సుధీర్ బాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తన అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ప్రముఖ రచయిత దర్శకుడు హర్షవర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ లుక్ రిలీజ్ నుంచే ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తరువాత కొంత విరామం తీసుకున్న సుధీర్ బాబు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఆయన చేతిలో వరుసగా మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ‘మామా మశ్చీంద్ర’ మూవీ ఒకటి. సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం ఈ మూవీ నుంచి సర్ ప్రైజింగ్ గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ మూవీలో సుధీర్ బాబు మ్యాచో మాన్ గా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నారు. షర్ట్ లేకుండా సుధీర్ బాబు వర్కవుట్స్ చేస్తూ గాల్లో తేలుతున్న విన్యాసాలు ఫ్లోర్ పై డ్యాన్స్ చేస్తున్న సుధీర్ బాబు లుక్స్ మరింతగా ఆకట్టుకుంటున్నాయి.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై నారాయణ దాస్ నారంగ్ పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఇటీవలే నారాయణ్ దాస్ నారంగ్ మృతి చెందడంతో ఈ మూవీ నిర్మాణ బాధ్యతల్ని పుస్కూర్ రామ్మోహన్ రావు తో పాటు సునీల్ కె. నారంగ్ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది.
View this post on Instagram