టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు తాజాగా తన కొత్త సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. పలాస దర్శకుడు కరుణ కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకి ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు . కాగా దీనికి సంబందించిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ విడుదల చేశారు. ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దీని సంబంధించి నిన్న ప్రకటన కూడా చేశారు (అక్టోబర్ 30) ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. చెప్పినట్లుగానే ఈరోజు టైటిల్ మరియు ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని 70ఎమ్.ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ సంగీతం అందించనున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.