HomeTelugu Newsతొలి ప్రియురాలిని కలిసిన సుధీర్‌బాబు!

తొలి ప్రియురాలిని కలిసిన సుధీర్‌బాబు!

9 6సినీ పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఇప్పటికే క్రీడాకారులకు సంబంధించి ‘మేరీ కోమ్‌’, ‘ఎమ్‌.ఎస్‌. ధోనీ’, ‘సచిన్‌’ తదితర సినిమాలు వచ్చాయి. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారు. మరోపక్క ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు, కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ జీవితం ఆధారంగా సినిమా రాబోతోంది. హీరో సుధీర్‌బాబు ఈ చిత్రంలో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ప్రవీణ్‌ సత్తారు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతోపాటు హిందీలోనూ ఈ సినిమా రాబోతోంది. ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ అబన్‌డన్షియ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

పుల్లెల గోపీచంద్‌ పాత్ర కోసం సిద్ధమౌతున్నట్లు సుధీర్ మంగళవారం సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. బ్యాడ్మింటన్ సాధన చేస్తున్న వీడియోను షేర్‌ చేశారు. ఈ ఆట తన తొలిప్రేమని ట్వీట్‌ చేశారు. ‘తిరిగి నా తొలి ప్రియురాలు (బ్యాడ్మింటన్‌) దగ్గరికి వచ్చా.. తొలి ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుందని అందరూ అంటుంటారు (సరదాగా). పుల్లెల గోపీచంద్‌కు సిద్ధమౌతున్నా’ అని అన్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఎటువంటి స్పందనలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu