టాలీవుడ్ హీరో సుధీర్ బాబు- మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సుధీర్ 14’ వర్కింగ్ టైటిల్‌తో ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా పేరును తాజాగా ప్రకటించింది చిత్రబృందం. ప్రేమకథా నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే ఆసక్తికర టైటిల్‌ని ఫిక్స్ చేశారు. సోమవారం చిత్రీకరణ ప్రారంభించినట్టు చిత్ర వర్గాలు తెలియజేశాయి. బెంచ్ మార్క్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు సుధీర్ బాబు కరుణ కుమార్ దర్శకత్వంలో ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రంలో నటిస్తున్నారు .