సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో అశోక్ తేజ హైదరాబాద్ లోని ఏషియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ గాస్ట్రోలాజి ఆస్పత్రిలో చేరాడు. కాగా అతడికి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైందని అశోక్ తేజ తమ్ముడు ప్రభుత్వ సలహాదారుడు మీడియాకు వెల్లడించారు. శనివారం ఉదయం 9:30 నుండి సాయంత్రం గంటల వరకు శస్త్ర చికిత్స జరిగింది. అశోక్ తేజకు అతని కుమారుడు అర్జున్ కాలేయ దానం చేసారు. ఈ ఆపరేషన్ విజయవంతమైందని వైద్యులు తెలిపారు. సాయంత్రం ఆశోక్ తేజ తనతో మాట్లాడారని చికిత్స చేసిన ఆస్పత్రి బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా రక్తదానం చేసిన దాతలకు చిరంజీవి బ్లడ్ బ్యాంకు కు, ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు.