నచ్చిన ఉపాధ్యాయులను విద్యార్థులు గుండెల్లో పెట్టుకుంటారనడానికి కర్ణాటకలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటనే ఉదాహరణ. కొప్పల్‌లోని వీరాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిని ప్రభుత్వం మరో పాఠాశాలకు బదిలీ చేసింది. అయితే ఆ ఉపాధ్యాయురాలితో అనుబంధం పెంచుకున్న ఆ విద్యార్థులు ఆమెను వెళ్లొద్దంటూ వెక్కి వెక్కి ఏడ్చేశారు. నూటికో కోటికో ఒక్కరూ.. ఎక్కడో ై ఎప్పుడో పుడతారు.. అది మీరే మీరే మాస్టారు.. మా దేవుడు మీరే మాస్టారు అంటూ ఆమెను వెళ్లొద్దంటూ పట్టుకుని ఏడ్చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వీరాపూర్ ప్రభుత్వ పాఠశాలలో రజనీ అనే ఉపాధ్యాయురాలు గత ఎనిమిదేళ్లుగా అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు తాజాగా మరో పాఠశాలకు బదిలీ అయింది. ఈ సంగతి తెలిసిన విద్యార్థులంతా వెళ్లొద్దు టీచర్ అంటూ కన్నీరు మున్నీరయ్యారు. వారిని ఓదార్చుతూ ఆ ఉపాధ్యాయురాలు కూడా కంటతడి పెట్టారు. వారి జ్ఞాపకాలను పదిలంగా అక్కడే వదిలేస్తూ.. బరువెక్కిన హృదయంతో చివరకు వెళ్లక తప్పలేదు.