రాజకీయాల్లో విధేయతలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి అని వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తిని పసిగడితే అర్ధం అవుతుంది. ఇన్నేళ్లు జగన్ రెడ్డి మా దేవుడు అని కీర్తించిన నోళ్లే.. ఇప్పుడు బూతులు తిడుతున్నాయి. పైగా సీక్రెట్ గా పక్క చూపులు చూస్తున్నాయి. అయినా, ఏ గూటి పక్షులకు ఆ గూటి ముచ్చట్లే చెబుతాయి. వైసీపీ వ్యవహారం ఇప్పుడు అలానే ఉంది. గుప్పిట మూసి ఉన్నంతవరకు గుప్పిట్లో ఏం ఉందో అర్థం కాదు. కాస్తంత సడలినా.. లోపల ఉందేమిటో అర్థమైపోతుంది. ఇన్నాళ్లు వైసీపీకి ఎదురు లేదు, జగన్ రెడ్డికి తిరుగు లేదు అని ప్రచారం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ను మరో ముప్పై ఏళ్ల పాటు జగన్ రెడ్డే పాలించబోతున్నాడు అని కవరింగ్ ఇచ్చారు. అసలు జగన్ రెడ్డి గురించి జనం ఏం అనుకుంటున్నారు ? అని వైసీపీ నాయకులు మర్చిపోయారు. ఐతే, ఏ ముహుర్తంలో వచ్చాయో కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎందుకు వచ్చాయా? అన్నట్లుగా జగన్ రెడ్డి ప్రస్తుత పరిస్థితి మారిపోయింది. ఏపీ అధికార పార్టీలో అసలు ఈ స్థాయిలో లుకలుకలు ఉన్నాయా ? అని ప్రజలు సైతం ఆశ్చర్య చకితులు అవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఒక్కటే. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వచ్చిన ఏ ఎన్నికల్లోనూ ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురుకాలేదు.
ముఖ్యమంత్రి అయ్యాక మొదటి సారి జగన్ రెడ్డికి ప్రజలు ఎదురు తిరిగారు. ఈ ఎదురైన ఇబ్బందుల్ని ఎలా అధిగమించాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నాడు జగన్. ఏం చేయాలన్నా పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎవరు ఎలా జంప్ అవుతారో అర్ధం కానీ పరిస్థితి. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి తీవ్ర ఆగ్రహంతో నేరుగా జగన్ రెడ్డి పైనే విమర్శలు చేసింది. శ్రీదేవి వాదనను విన్న వైసీపీ వాళ్ళు కూడా.. ఆమె చెప్పింది నిజమే కదా అని భావించాల్సి వస్తోంది. దీనికి కారణం జగన్ రెడ్డే. తానూ సీఎం అయ్యాక, పూర్తిగా మారిపోయాడు.
ఎన్నికలకు ముందు అన్న, అక్కా అంటూ పిలిచి.. సీఎం పీఠం ఎక్కాక మాత్రం, కనీసం కలవడానికి కూడా ఛాన్స్ ఇవ్వకపోవడం వైసీపీ నాయకులను కూడా బాధ పెట్టింది. దీనికితోడు సీటు కావాలంటే.. ఫలానా మొత్తం పార్టీకి డొనేట్ చేయి అని, డబ్బులు తీసుకుని.. ఇప్పుడు ఆ డబ్బులను సంపాదించుకునే అవకాశం ఇవ్వకుండా.. మొత్తం జగన్ రెడ్డే దోచుకోవడం వైసీపీ పార్టీ నాయకులకే నచ్చడం లేదు. మొత్తమ్మీద జగన్ రెడ్డి పతనానికి ముగింపు బలంగానే పడుతుంది.