HomeTelugu Trending'పుష్ప’ షూటింగ్‌లో విషాదం.. ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ మృతి

‘పుష్ప’ షూటింగ్‌లో విషాదం.. ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ మృతి

Still Photographer sriniva
స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ నటిస్టున్న ‘పుష్ప’ మూవీ షూటింగ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ స్టిల్ ఫొటోగ్రాఫర్‌ జీ శ్రీనివాస్ (54) గురువారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం మారేడుమిల్లి అడవుల్లో జరుగుతున్న క్రమంలో మూవీకి స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో యూనిట్ వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మార్గమధ్యలోనే ఆయన్ను కన్నుమూశారు.

శ్రీనివాస్ దాదాపు 200 పైగా సినిమాలకు స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. తెలుగు సినీ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కూడా పని చేశారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలున్నారు. కాగా పుష్ప ఆగస్టు 13న విడుదల కాబోతుంది.

బన్నీ ‘పుష్ప’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Recent Articles English

Gallery

Recent Articles Telugu