సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్-2023 వేడుక దుబాయ్ వేదికగా కన్నుల పండుగగా సాగుతోంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ వేడుక దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో 15వ తేదీన ఘనంగా ప్రారంభమైంది. మొదటిరోజు తెలుగు, కన్నడ స్టార్స్ హాజరయ్యారు.
టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్, రానా, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రామ్ మిరియాల, మృణాల్ ఠాకూర్, అడవి శేష్, శృతి హాసన్, శ్రీలీల, శ్రీనిధి, అశ్వినీ దత్, నిఖిల్ సహా పలువురు స్టార్స్ పాల్గొని సందడి చేశారు. ఆర్ఆర్ఆర్ లో నటనకు గాను ఉత్తమ నటుడి అవార్డును ఎన్టీఆర్ అందుకున్నారు.
ధమాకా మూవీలో మెరిసిన శ్రీలీల ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా దర్శకుడు రాజమౌళికి ఉత్తమ దర్శకుడు అవార్డు దక్కింది. సీతారామం ఉత్తమ చిత్రం అవార్డును దక్కించుకుంది. కలర్ ఫుల్, ట్రెండీ దుస్తుల్లో తారలు తళుక్కుమన్నారు. తమ ప్రదర్శనల ఆకట్టుకున్నారు. శ్రీలీల, మృణాల్ ఠాకూర్, ప్రణీత సుభాష్ తమ నాట్యంతో మెప్పించారు.