
Allu Arjun Atlee Movie Update:
ప్రియాంక చోప్రా.. పేరు వినగానే గ్లామర్, టాలెంట్ గుర్తొస్తాయి. బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు తన సత్తా చూపిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు పూర్తిగా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె అమెరికాలో స్థిరపడింది. నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.
ఇక ఇండియన్ సినిమాల విషయానికి వస్తే, ప్రియాంక చోప్రా ఈ మధ్య కాలంలో ఒక్క భారతీయ సినిమా మాత్రమే అంగీకరించింది. అదే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్. ఇందులో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రియాంక భారీ డేట్స్ కేటాయించిందట.
అయితే తాజాగా మరో ఆసక్తికర వార్త బాలీవుడ్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. అల్లు అర్జున్ మరియు డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న పాన్ ఇండియా సినిమాకి ప్రియాంక చోప్రాను హీరోయిన్‌గా తీసుకోవాలని భావించారట. అయితే ఆమె ఈ ఆఫర్‌ను తేలికగా తిరస్కరించిందట. కారణాలు స్పష్టంగా తెలియకపోయినా, ఆమె ఇప్పటికే రాజమౌళి సినిమా కోసం డేట్స్ ఇచ్చిందన్నది ఓ కారణం కావచ్చు. మరోవైపు ఆమెకు హాలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ పెద్ద ప్రాజెక్ట్స్ లైనప్‌లో ఉన్నాయని సమాచారం.
అల్లు అర్జున్-అట్లీ కాంబో ప్రాజెక్ట్ మాత్రం రేపు అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించనుంది. భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ సినిమా, మరొకసారి బన్నీ అభిమానులకు ఫుల్ ఫీస్ట్ ఇవ్వనుంది. కానీ ప్రియాంక ఈ ప్రాజెక్ట్‌కు దూరంగా ఉండటమే కొంచెం ఆశ్చర్యంగా మారింది.