HomeTelugu Big StoriesMaharaja డైరెక్టర్ ఇప్పుడు మహారాణి తో.. హీరోయిన్ ఎవరో తెలుసా?

Maharaja డైరెక్టర్ ఇప్పుడు మహారాణి తో.. హీరోయిన్ ఎవరో తెలుసా?

Star heroine to join hands with Maharaja director?
Star heroine to join hands with Maharaja director?

Maharaja director next movie:

ఏమాత్రం అంచనాలు లేకుండా ఆ సైలెంట్ గా విడుదలైన Maharaja సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. తమిళ్లో మాత్రమే కాక అన్ని భాషల్లోనూ ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్ అందుకుంది. తెలుగులో విజయ్ సేతుపతి సోలో హీరోగా నటించి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సినిమా మహారాజా అని చెప్పుకోవచ్చు.

కేవలం 20 కోట్ల బడ్జెట్ లో తీసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అందుకుంది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించిన చిత్ర డైరెక్టర్ నితిలన్ స్వామినాథన్ నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుందో అని కూడా సర్వత్ర ఆసక్తి నెలకొంది. తాజాగా దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమా కోసం చిత్ర డైరెక్టర్ మహారాణి అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా మహారాజా జోనర్ లోనే ఉంటుందట. అంతేకాకుండా మహారాజా సినిమాకి మించిన థ్రిల్, సస్పెన్స్ ఉండేలాగా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టైటిల్ రోల్ కోసం ఒక స్టార్ హీరోయిన్ ని సంప్రదించారట.

ఆమె మరెవరో కాదు సౌత్ లేడీస్ సూపర్ స్టార్ నయనతార. ఆమె కూడా సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. ఫ్యాషన్ స్టూడియోస్ వారే ఈ సినిమాని కూడా నిర్మించే అవకాశం ఉంది. మహారాణి అనే టైటిల్ లోనే ఈ చిత్రం ఒక ఫిమేల్ సెంట్రిక్ సినిమాగా ఉంటుంది అని తెలిసిపోతుంది. ఇప్పటికే నయనతార బోలెడు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేశారు.

ఈ సినిమాని కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇంకా ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి. అవి పూర్తవగానే సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మహారాజా సినిమా నెట్ఫ్లిక్స్ లో ఇంకా టాప్ టెన్ లో ట్రెండ్ అవుతూ స్ట్రీమ్ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu