HomeTelugu Big StoriesGOAT కి నో చెప్పిన స్టార్ హీరోయిన్.. సినిమా విడుదల అయ్యాక ఏమందో తెలుసా?

GOAT కి నో చెప్పిన స్టార్ హీరోయిన్.. సినిమా విడుదల అయ్యాక ఏమందో తెలుసా?

Star heroine rejected GOAT but called the director after release
Star heroine rejected GOAT but called the director after release

GOAT movie:

తలపతి విజయ్ నటించిన The GOAT సినిమా తమిళ్ బాక్సాఫీస్‌ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది కానీ తెలుగులో మాత్రం.. కలెక్షన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటేసి.. త్వరలోనే రూ. 400 కోట్ల వైపు దూసుకెళ్తోంది.
ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. సినిమాలో తండ్రి, కొడుకులుగా కనిపించారు విజయ్. ఇందులో యంగ్ విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా, తండ్రి విజయ్ భార్య పాత్రలో స్నేహ కనిపించింది. తాజాగా ఇంటర్వ్యూలో, దర్శకుడు వెంకట్ ప్రభు విజయ్ భార్య పాత్ర కోసం స్టార్ హీరోయిన్ ను సంప్రదించారని చెప్పుకొచ్చారు.
మొదట ఆ పాత్ర కోసం నయనతారను సంప్రదించానని కానీ తర్వాత స్నేహను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం నయనతార స్వయంగా వెంకట్ ప్రభు కి కాల్ చేశారట. “సినిమా చూసిన తర్వాత నయనతార మామ్ నాకు కాల్ చేశారు. ఆమెకు సినిమా చాలా నచ్చింది. స్నేహ మామ్ అద్భుతంగా నటించారని, ఆమె లాగా మరెవ్వరూ ఈ పాత్రను చేయలేరని అన్నారు” అని నయనతార చెప్పారని అన్నారు వెంకట్ ప్రభు.
వెంకట్ ప్రభు చేసిన ఈ వ్యాఖ్యలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ సినిమాలో ప్రభుదేవా, స్నేహ, లైలా, జయరాం, యోగి బాబు, మోహన్, అజ్మల్, వీటీవీ గణేష్, వైభవ్, ప్రేమగి అమరెన్, ఆకాశ్ అరవింద్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై అర్చనా కలపతి, కలపతి గణేష్, కలపతి సురేష్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu