HomeTelugu Newsతిట్టించుకోకపోతే నిద్రపట్టదు: రామ్‌ గోపాల్‌ వర్మ

తిట్టించుకోకపోతే నిద్రపట్టదు: రామ్‌ గోపాల్‌ వర్మ

13 10ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. తిట్టించుకోకపోతే నాకు నిద్రపట్టదు అని అంటున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఎంటర్‌ ది గర్ల్‌ డ్రాగన్‌’. బ్రూస్‌లీ స్ఫూర్తిగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. బుధవారం బ్రూస్‌ లీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ విలేకర్లతో సరదాగా ముచ్చటించారు. ఇందులో భాగంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ‘తిట్టించుకోకపోతే నాకు నిద్రపట్టదు. అలాంటి బుద్ధి ఒకటి నాలో డెవలప్‌ అయ్యింది. చిన్నప్పటి నుంచి నాకు గిల్లడం ఇష్టం. ఎవరైనా నన్ను సినిమా ఎందుకు అంత ఫాస్ట్‌గా తీస్తావంటే.. వేరేవాళ్లు స్లోగా తీస్తారు కానీ నేను ఫాస్ట్‌గా తియ్యను అని చెబుతాను.’ అని సమాధానం చెప్పారు.

మరో విలేకరి మీరు స్టార్‌ హీరోలతో సినిమా ఎందుకు తియ్యరు అని ప్రశ్నించగా.. ‘నేను చేసే సినిమాలకు ఇమేజ్‌ ఉన్న హీరోలు సెట్‌ కారు. ఎందుకంటే నేను వాస్తవిక చిత్రాలు తీస్తాను.’ అని అన్నారు. భక్తి సినిమా చేస్తారా? అనే ప్రశ్నకు సమాధానంగా.. ‘ఒక వేళ నేను భక్తి సినిమా చేస్తే చంపేస్తారేమో అనుకుంటున్నాను. నిజంగా నేను చేసినా కూడా వెనకాల ఏదో చేసేస్తున్నాడు వీడు అని అనుకుంటారు.’ అని ఆర్జీవీ తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu