HomeTelugu Big StoriesJani Master వివాదంలో కీలక మలుపు.. స్టార్ హీరో ఎంట్రీ

Jani Master వివాదంలో కీలక మలుపు.. స్టార్ హీరో ఎంట్రీ

Star hero support to Jani Master Victim
Star hero support to Jani Master Victim

New Twist in Jani Master Controversy

ప్రముఖ కొరియోగ్రాఫర్ Jani Master అలియాస్ షేక్ జానీ బాషా మీరు హైదరాబాద్ పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో నమోదైంది కానీ ఘటన జరిగింది నార్సింగి పరిధిలో కాబట్టి అక్కడికి బదిలీ చేశారు.

తెలుగులో ఒక డ్యాన్సింగ్ షో సమయంలో ఒక ఫిమేల్ కొరియోగ్రాఫర్ (బాధితురాలు) జానీ మాస్టర్‌కు పరిచయమైనట్టు సమాచారం. జానీ మాస్టర్ టీమ్‌లో ఆమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా.. ముంబైలోని ఓ హోటల్‌లో జానీ మాస్టర్ ఈమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని.. ఈ విషయం బయటికి వస్తే పని లోంచి తీసేస్తాను అని ఆమెను హెచ్చరించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు.

అంతేకాకుండా మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను బలవంతం చేసినట్లుగా ఎఫ్ఐఆర్‌లో తెలియజేసింది. తన కోరిక తీర్చకుంటే ఇండస్ట్రీలో ఒక్క ఆఫర్ కూడా రాకుండా చేస్తానని బెదిరించాడని, షూటింగ్ సమయంలో తనపై బలాత్కారం చేయబోయినట్లుగా బాధితురాలు పేర్కొంది. అర్థరాత్రులు ఇంటికి వచ్చేవాడు అని.. అతని భార్య కూడా లొంగిపోమని బెదిరించేది అని బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడింది. యాంకర్, సినీనటి ఝాన్సీ మాట్లాడుతూ.. ఓ పెద్ద హీరో తన మేనేజర్‌ని పంపించి ఆమెకు మద్దతు పలికినట్లు చెప్పారు. ఓ పెద్ద బ్యానర్‌ బాధితురాలికి ఒక సినిమాకి ఛాన్స్ ఇచ్చిందని .. ఇండస్ట్రీ నుంచి మంచి టాలెంట్‌కి ఎప్పుడూ సపోర్ట్ ఉంటుందని, ఆమె అన్నారు. ఈ వీడియో వైరల్ అవుతూ ఉండగా.. బాధితురాలికి అండగా నిలిచిన పెద్ద హీరో ఎవరు అనే విషయం మీద చర్చ కూడా మొదలైంది.

Read More: Koratala Siva: డిజాస్టర్ తర్వాత రెమ్యూనరేషన్ పెంచేసిన డైరెక్టర్

Recent Articles English

Gallery

Recent Articles Telugu