టాలీవుడ్ కు చెందిన ప్రముఖ సీనియర్ హీరో గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తన వయసు పెరుగుతున్న కొద్దీ గ్లామర్ ను మరింత పెంచుకుంటోన్న ఈ హీరోకి కిడ్నీ సమస్య వచ్చిందని తెలుస్తోంది. ఈ సమస్య అంత తీవ్రమైనది కాకపోయినా.. దీర్ఘకాలం ట్రీట్ మెంట్ అవసరమని డాక్టర్స్ చెప్పినట్లు టాక్.
బెంగుళూరులో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ అయితే అందరికీ తెలిసే అవకాశాలు ఉన్నాయి కాబట్టే అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని అంటున్నారు. ప్రస్తుతానికైతే మెడిసిన్స్ తో సరి పెడుతున్నారు. అవసరమైతే డయాలసిస్ చేయాలనుకుంటున్నారు. మరి ఈ విషయం ఇంకెన్ని రోజులు దాయడానికి ప్రయత్నిస్తారో..? ప్రస్తుతం అయితే ఆ హీరో బాగానే బయట తిరుగుతున్నారు.