
100 కోట్ల నుంచి కోటి రూపాయలకు పడిపోయిన Star Hero:
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే హీరోలకి విలువ ఉంటుంది. ఒకప్పుడు సూపర్‌హిట్ ఇచ్చిన హీరోలు కూడా వరుస ఫ్లాప్‌లను ఎదుర్కొంటే, మార్కెట్ తగ్గిపోతుంది. తెలుగులో అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న యువ హీరో నిఖిల్.
2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో నిఖిల్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలతో పరాజయాలు ఎదురైనా, స్వామి రారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ వంటి చిత్రాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. అర్జున్ సురవరం సినిమాతో తన మార్కెట్ పెంచుకున్న నిఖిల్, 2022లో వచ్చిన కార్తికేయ 2తో అయితే ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్‌కు గురి చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అందుకుని నిఖిల్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
అయితే, కార్తికేయ 2 తర్వాత నిఖిల్ చేసిన సినిమాలు ఊహించిన స్థాయిలో ఆడలేదు. స్పై సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అదే విధంగా, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాకైతే ప్రేక్షకులు ఎప్పుడు విడుదలైందో కూడా గుర్తించలేని పరిస్థితి. ఫలితంగా, ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా చాలా నిరాశపరిచాయి. రూ.100 కోట్ల సినిమా హిట్ ఇచ్చిన హీరో చిత్రం కేవలం కోటి రూపాయలు కూడా రాబట్టలేదంటే, నిఖిల్ కెరీర్ ఎలాంటి మలుపులో ఉందో అర్థం చేసుకోవచ్చు.
వరుస ఫ్లాప్‌లతో నిఖిల్ కెరీర్‌కు కాస్త వెనుకంజ పడినట్టే కనిపిస్తోంది. అయితే, అతడు మళ్లీ ఫామ్‌లోకి రావాలని కృషి చేస్తున్నాడు. ప్రస్తుతం నిఖిల్ స్వయంభు అనే పాన్-ఇండియా ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు. హిస్టారికల్ ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే, కార్తికేయ 3 మూవీతో మళ్లీ తన హిట్ ఫార్ములాను రిపీట్ చేయాలని చూస్తున్నాడు.
ఈ రెండు సినిమాలు నిఖిల్ కెరీర్‌కు ఎంత వరకు లాభం తెచ్చిపెడతాయో చూడాలి. మరి నిఖిల్ మళ్లీ కార్తికేయ 2 స్థాయిలో హిట్ కొట్టి ఫామ్‌లోకి వస్తాడా, లేక ఇంకా నిరాశే ఎదురవుతుందా అన్నది చూడాల్సిన విషయం.
ALSO READ: SSMB29 షూటింగ్ నుండి Priyanka Chopra ఎందుకు బ్రేక్ తీసుకుందో తెలుసా