Star Hero Movies:
నిర్మాతలు Star Hero తో సినిమా అంటే బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనుకాడరు. భారీ బడ్జెట్ సినిమా తీయాలి అంటే అప్పులు కూడా భారీగానే అవుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా సినిమా బడ్జెట్ లో సగం లేదా అంతకుమించి మొత్తం స్టార్ హీరో రెమ్యూనరేషన్ కి వెళ్ళిపోతూ ఉంటుంది.
అయితే పేమెంట్ విషయంలో అయినా స్టార్ హీరోలు తగ్గుతారా అంటే అది కూడా లేదు. మొన్నా మధ్య ఒక స్టార్ హీరో సినిమా షూటింగ్ మొదలవ్వాలి అంటే ఫుల్ పేమెంట్ ఇవ్వాల్సిందే అని మొండిపట్టు పట్టారు. ఎంత నిర్మాతలు డిజాస్టర్లు అందుకునే అప్పుల్లో మునిగి ఉన్న కూడా ఆ స్టార్ హీరో మాత్రం ఫుల్ పేమెంట్ ఇస్తేనే షూటింగ్ మొదలవుతుంది అని కరాకండిగా చెప్పేశారు.
ఇక చేసేది లేక నిర్మాతలు మళ్లీ అప్పు చేసి మరి స్టార్ హీరోలకి రెమ్యూనరేషన్ ఇచ్చి షూటింగ్ మొదలు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు మరొక మాస్ హీరో కూడా అదే బాటలో వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఆ హీరో మార్కెట్ వరుస ప్లాప్స్ వల్ల బాగా తగ్గిపోయింది. అసలు అన్ని ఫ్లాప్స్ ఉన్న హీరోతో సినిమా చేయాలని నిర్మాతలు అనుకోవడమే ఒక గొప్ప విషయం. కానీ ఆ హీరో మాత్రం అలా అనుకోలేదు.
మొత్తం డబ్బులు ఇస్తేనే షూటింగ్ మొదలు పెడతానని చెప్పారు. ఒకరోజు అటు ఇటు అయినా కూడా కుదరదు అని మొహమాటం లేకుండా చెప్పేసారట. నిజానికి అది పేరు ఉన్న నిర్మాణ సంస్థ. కాబట్టి కచ్చితంగా రెమ్యూనరేషన్ విషయంలో తేడా జరగదు. అయినా కూడా హీరో ఒక్కొక్క పోవడంతో.. నిర్మాతలు వెంటనే హీరోకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసారట. అప్పుడు శాంతించిన హీరో సినిమా షూటింగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ రకంగా స్టార్ హీరోలు కూడా నిర్మాతలకు బాగానే తలనొప్పులు తీసుకువస్తున్నారు.