ఏ పోటీకైనా సమ ఉజ్జీ ఉంటేనే ఆట రసవత్తరంగా ఉంటుంది. అలాగే సినిమాలో హీరోకి తగ్గట్టుగా విలన్ పాత్ర కూడా పవర్ ఫుల్‌గా ఉన్నప్పుడే సినిమా రసవత్తరంగా సాగుతుంది. విలన్‌తో కామెడీ చేయించిన సినిమాలు విజయవంతమైనవి తక్కువనే చెప్పాలి. అందుకే దర్శకులు సినిమాల్లో హీరోలకు సమానంగా విలన్‌కు ప్రాధాన్యం ఇస్తుంటారు. దీనికోసం రెమ్యూనరేషన్ ఎక్కువ ఇచ్చి అయినా ఇతర భాషల్లోని హీరోలను విలన్‌గా తీసుకొస్తున్నారు.
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాలోనూ టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు విలన్‌గా కనిపించనున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. సైరా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మెగాస్టార్ మరోసారి తన అభిమానులను అలరించబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కలెక్షన్ అండ్ డైలాగ్ కింగ్ మోహన్‌బాబు పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు చెప్తున్నారు. చిరంజీవి, మోహన్‌బాబు మధ్య ఎలాంటి వార్ లేదని, ఈ మధ్య మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సమావేశంలో స్టేజ్‌పై వీరిద్దరిని చూసిన ఎవరికైనా అర్ధమైపోతుంది. ఏకంగా మోహన్‌బాబును చిరంజీవి కౌగిలించుకుని ముద్దుకూడా పెట్టారు. రాజకీయాలు శత్రువులను పెంచితే.. సినీ కళామతల్లి మామధ్య స్నేహాన్ని, ప్రేమను పెంచిందన్నారు చిరంజీవి. మెగాస్టార్‌కు, రాజశేఖర్‌కు జరిగిన వివాదంలో చిరంజీవికి మోహన్‌బాబు మద్దతుగా నిలిచారు. దీన్నిబట్టి చూస్తుంటే వీరిద్దరూ కలిసి నటిస్తే అటు అభిమానులు కూడా ఎంతో ఆనందించే విషయం కాబట్టి చిరంజీవి సినిమాలో మోహన్‌బాబు పాత్రపై బలం చేకూరుతుంది. అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. చిరంజీవికి జంటగా త్రిష నటిస్తోంది.