MS Dhoni in GOAT:
తల ధోని, తలపతి విజయ్ లకి తమిళనాడులో క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. విజయ్ కి స్టార్ హీరోగా పట్టం కట్టిన తమిళనాడు ప్రేక్షకులు.. చెన్నై సూపర్ కింగ్స్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఏం ఎస్ ధోని మీద కూడా అంతే ప్రేమ కురిపిస్తూ ఉంటారు. ధోనిని తమిళనాడు దత్తపుత్రుడిగా కూడా పిలవచ్చు.
ఇదిలా ఉండగా, విజయ్ నటించిన తాజా సినిమా GOAT సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో, గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ధోని ఈ సినిమాలో ఓ క్యామియో పాత్రలో కనిపించారని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అదికాక, చిత్ర ట్రైలర్‌లో కూడా విజయ్ క్రికెట్ స్టేడియంలో ఉన్న సన్నివేశం కనిపించడం ఈ పుకార్లకు ఆద్యం పోసినట్టు అయ్యింది.
ఈ పుకార్లపై స్పందించిన చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు, ధోని ఈ సినిమాలో కనిపించడంలేదని స్పష్టం చేశారు. అయితే, మొదట్లో ధోని క్యామియో చేయాలని ప్రయత్నించినా అది సవ్యంగా అమలు కాలేదని వివరించారు.
అయితే, ఈ సినిమాలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఒక క్రికెట్ మ్యాచ్‌ను చూపించనున్నారట. ఈ మ్యాచ్ సన్నివేశాల్లో రెండు జట్లకు చెందిన ప్రముఖ క్రికెటర్ల ఫోటోలు కూడా చూపించనున్నారు అని సమాచారం. ఈ నేపథ్యంలో ధోని అభిమానులు కొంత నిరాశ చెందుతున్నారు కానీ సినిమా క్రికెట్ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి వెంకట్ ప్రభు ఇలా ప్లాన్ చేశారని చెప్పుకోవచ్చు.