HomeTelugu Big StoriesSSMB29 Update: మహేష్ బాబు కోసం మలయాళం హీరో..

SSMB29 Update: మహేష్ బాబు కోసం మలయాళం హీరో..

SSMB29 Update
SSMB29 Update: Malayalam star as main villain look

SSMB29 Update:

తెలుగు సినీ ఇండస్ట్రీని ఒకేసారి నాలుగైదు మెట్లు పైకి ఎక్కించిన ఘనత స్టార్ డైరెక్టర్ రాజమౌళిదే అని చెప్పుకోవచ్చు. కమర్షియల్ సినిమాలు ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో ప్యాన్ ఇండియా రేంజ్ కంటెంట్ తో బాహుబలి సినిమాతో రాజమౌళి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. బాహుబలి ఫ్రాంచెస్ తో ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీని పరిచయం చేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచపు నలుమూలల టాలీవుడ్ పేరు మారు మ్రోగేలా చేశారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకి ఆస్కార్ కూడా అందిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ ఇండస్ట్రీకి టార్చ్ బేరర్ గా పిలవబడుతున్న రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు రాజమౌళి వంటి క్రేజీ కాంబినేషన్లో సినిమా కాబట్టి అందరూ ఈ సినిమా ఎలా ఉండబోతోందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

SSMB29 Update:

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ప్రముఖ మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారట. మలయాళం లో స్టార్ హీరో అయినా పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ఈ మధ్యనే ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమాలో ప్రభాస్ స్నేహితుడి పాత్రలో కనిపించిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించబోతున్నారట. సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న పృథ్వీరాజ్ ఇప్పుడు ఏకంగా రాజమౌళి దర్శకత్వంలోనే నటిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ సినిమా రైటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిపోయింది. ప్రీ ప్రొడక్షన్, క్యాస్టింగ్ పనులతో చిత్ర బృందం బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఆర్ఆర్ఆర్ రికార్డులను బ్రేక్ చేస్తుంది అని అభిమానులు విశ్వసిస్తున్నారు.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu