SSMB29 shooting update:
తెలుగు ప్రేక్షకుల్లో మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’ పట్ల భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయి, చిత్రబృందం రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు కెన్యాకు బయలుదేరింది.
ఈ మూవీలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా ఫిక్స్ అయ్యిందని వార్తలు రాగా, ఆమె తాజాగా హైదరాబాద్‌లో కనిపించడంతో ఈ ప్రచారం నిజమని కన్ఫర్మ్ అయ్యింది. దర్శకుడు రాజమౌళి తాజాగా షేర్ చేసిన ఓ వీడియోలో, మహేశ్ బాబు పాస్‌పోర్ట్ తన దగ్గరే ఉందని హింట్ ఇవ్వడంతో ఈ మూవీపై ఆసక్తి మరింత పెరిగింది. అదే పోస్ట్ కి ప్రియాంక చోప్రా కూడా రిప్లై ఇవ్వడంతో సినిమాలు ఆమె హీరోయిన్ అని ఫాన్స్ ఫిక్స్ అయిపోయారు.
రాజమౌళి గతంలోనే కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్‌ను పరిశీలించి, షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చే నెల నుంచి అక్కడ కీలక సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఫారిన్ యాక్టర్లతో పాటు హాలీవుడ్ నటులు కూడా ఈ సినిమాలో ఉండబోతున్నారని సమాచారం.
SSMB29 ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో రూపొందుతుండగా, మహేశ్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని భావిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించగా, కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 2027లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్.
ALSO READ: Marco నుంచి హలో మమ్మీ వరకు – ఈ నెల ఓటీటీలో రాబోయే ఆసక్తికర చిత్రాలు!