సూపర్ స్టార్ మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆకస్తికరంగా ఎదురు చూస్తారు. గతంలో వీళ్ళ కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా క్లాసిక్ చిత్రాలుగా నిలిచాయి. ఈ రెండు చిత్రాలు కమర్షియల్‌గా అంతగా సక్సెస్ సాధించకోపోయినా బుల్లితెరపై మాత్రం ఘన విజయం సాధించాయి. దాదాపు 12ఏళ్ళ తర్వాత వీరిద్దరూ కలిసి హ్యట్రిక్‌కు రెడీ అవుతున్నారు. ఫిబ్రవరిలోనే లాంఛనింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. తాజాగా మేకర్స్ షూటింగ్ అప్‌డేట్‌పై క్లారిటీ ఇచ్చారు.
ఇటీవలే త్రివిక్రమ్, మహేష్‌కు ఫుల్ స్క్రిప్ట్‌ను వినిపించాడట. కాగా తాజాగా మేకర్స్ ఈ సినిమా షూటింగ్‌పై క్లారిటీ ఇస్తూ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టులో షూటింగ్ ప్రారంభించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు కూడా గ్లింప్స్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని హారిక హాసని క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
The Evergreen Combo of Super Star @urstrulyMahesh & our Darling Director #Trivikram is back to REIGN! 🔥
The most eagerly awaited #SSMB28 pre-production has started on EPIC proportions! Shoot starts This Aug✨
Be Ready for a MASSive Blast at the Screens ~ Summer 2023! pic.twitter.com/m4g6m3p9Ad
— Haarika & Hassine Creations (@haarikahassine) July 9, 2022