HomeTelugu Newsకరోనాపై దర్శక ధీరుడు రాజమౌళి ట్వీట్

కరోనాపై దర్శక ధీరుడు రాజమౌళి ట్వీట్

16 1
చైనాలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పటి వరకు 125 దేశాలకు పైగా పాకింది. ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ సందర్భంగా కరోనా వైరస్‌పై దర్శక ధీరుడు ఎస్ ఎస్ రౌజమౌళి స్పందించారు. క‌రోనా వైరస్ కార‌ణంగా ప్రపంచం ఆగిపోవడం చూస్తుంటే షాక్‌కు గురిచేస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్రజలు భ‌యాందోళ‌న‌లకు గురికాకుండా చూడాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించ‌డానికి తగిన చర్యలను పాటించాలని సూచించారు. కరోనాపై అప్ర‌మ‌త్తంగా ఉంటే మంచిందని రాజ‌మౌళి త‌న ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu