రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ అశ్విన్ గంగరాజు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్నఆకాశవాణి చిత్రం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. నిర్మాతగా ఆకాశవాణి టీమ్ తో ఇన్నాళ్ల తన ప్రయాణం అద్భుతంగా సాగిందని, అయితే ఇతర ప్రాజెక్టులకు కొన్నింటికి లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నందున, వాటికి కూడా సమయం కేటాయించడం కోసం ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన తెలిపారు.
ఇకపై ఆకాశవాణి నిర్మాణ బాధ్యతలను ఏయూ అండ్ ఐ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఎ.పద్మనాభరెడ్డికి అప్పగిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాదు, దర్శకుడికి తనకు మధ్య కొన్ని సృజనాత్మక అంశాల్లో విభేదాలు వచ్చాయని, మరొకరి ఆలోచనలైతే చిత్ర నిర్మాణానికి మరింతగా ఉపకరించవచ్చేమోనని భావించి కూడా ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్టు కార్తికేయ వివరణ ఇచ్చారు.