తెలుగులో మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తున్నారు. కొమురంభీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా నిలిచిపోయిన షూటింగ్ మళ్లీ మొదలైంది. త్వరలోనే ఎన్టీఆర్ జాయిన్ కానున్నాడట. ఎన్టీఆర్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ముందుగా టెస్ట్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ పార్ట్ సగానికి పైగా పూర్తయింది. ఈ సినిమా నుంచి విడుదలైన రామ్‌చరణ్ టీజర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.