ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అని ముద్ర వేసుకొని అవకాశాలు లేక నిరాశతో ఉన్న శృతిహాసన్ కు పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు పవన్ కల్యాణ్. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్, శృతిల జంటకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా సూపర్ హిట్.. శృతి స్టార్ హీరోయిన్ల లిస్ట్ లోకి చేరిపోయింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కూడా నా కెరీర్ పరంగా గబ్బర్ సింగ్ కు ముందు ఆ తరువాత
అనే మాట్లాడుకోవాలి. ఆ సినిమా నా మీద అంత ప్రభావం చూపింది.
ఆ సినిమా ఛాన్స్ ఇచ్చిన పవన్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చింది. ఇన్నీ మాట్లాడి కాటమరాయుడు ప్రీరిలీజ్ ఫంక్షన్ మాత్రం ఎగ్గొట్టింది. సినిమాకు సంబంధం లేని వారు కూడా ఆ ఫంక్షన్ కు వచ్చారు. కానీ హీరోయిన్ అయిన శృతి రాకపోవడం పట్ల అందరూ పెదవి విరిచారు. ‘నేను ఫంక్షన్ కి రాలేకపోతున్నాను.. ట్రైలర్ చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అంటూ ఓ ట్వీట్ మాత్రం పెట్టింది.