బాలకృష్ణ, పూరీజగన్నాథ్ కాంబినేషన్ లో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించే స్కోప్ ఉంది. ఇప్పటికే ముస్కాన్ అనే బాలీవుడ్ అమ్మాయిని ఎంపిక చేశారు. త్వరలోనే బాలయ్య, ముస్కాన్ లపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ గా శ్రియను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బాలయ్య 100వ సినిమాలో నటించిన శ్రియను 101లో కూడా తీసుకోవడం విశేషం.
అలానే మూడో హీరోయిన్ గా ఛార్మి పేరు వినిపిస్తోంది. మరి ఈ సినిమాలో ఛార్మీను ఐటెమ్ సాంగ్ కోసం తీసుకుంటారా..? లేక హీరోయిన్ గా తీసుకుంటారో చూడాలి. ఈ సినిమాలో బాలయ్య గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. రెగ్యులర్ గ్యాంగ్ స్టర్ సినిమాలకు ఈ సినిమా భిన్నంగా ఉంటుందని ఇటీవల పూరి వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్తి చేసి రెండో షెడ్యూల్ కు రెడీ అవుతోంది.