కరోనా వైరస్ కారణంగా మన దేశంలో లాక్‌డౌన్ అమలులో ఉంది. లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఇంట్లోనే కూర్చున్న సెలెబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా కరోనా వైరస్ పై జనాల్లో అవగాహన కల్పిస్తున్నారు. కొంతమంది తమ కుటుంబాలతో గడిపిన క్షణాలను వీడియోలు, ఫోటోల రూపంలో అభిమానులతో పంచుకుంటున్నారు. కొద్ది నెలల క్రితం హీరోయిన్ శ్రియ రష్యాకి చెందిన బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కొసఛీవ్ ని వివాహం చేసుకుంది. రష్యాలో తన భర్త ఆండ్రీ కోస్చీవ్ తో కలిసి క్వారంటైన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.
ఈ జంట డిఫరెంట్ సైన్ బోర్డులతో చేసిన ఒక సిల్లీ అండ్ రొమాంటిక్ వీడియో తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో శ్రీయా ‘సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండని’ సైన్ బోర్డు చూపించగా తన హస్బెండ్ మాత్రం దీనికి ఫన్నీగా ‘ఈమె నాన్ స్టాప్ గా మాట్లాడుతుంది’ అనే సైన్ బోర్డు చూపించాడు. ‘రోజంతా నాన్‌స్టాప్ గా పనిచేస్తున్న వాళ్లకి థాంక్స్’ అని శ్రీయా చెప్పగా.. ‘నాతో రోజంతా పని చేయిస్తుంది’ అని ఆండ్రీ చూపిస్తున్నాడు. రోజంతా పని చేయిస్తున్నదని- ఆమె నుండి రక్షించమని అతను అడుగుతున్నట్లు కనిపిస్తుంది.