పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తోన్న ‘OG’ ఒకటి. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ స్టోరీతో రాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫుల్ లెంగ్త్ యాక్షన్ జోనర్లో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈ చిత్రం కోసం పక్క ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను తీసుకుంటున్నారు. వాళ్లంతా ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘OG’ మూవీలో మరో పవర్ఫుల్ లేడీని కూడా భాగం చేశారు. ఆమె ఎవరో కాదు.. కోలీవుడ్లో ఎన్నో చిత్రాల్లో హీరోయిన్గా సపోర్టింగ్ ఆర్టిస్టుగా నటించిన శ్రీయా రెడ్డి. ఈ బ్యూటీనే ఇప్పుడు పవన్ కల్యాణ్ సినిమాలో కీలక పాత్రను చేస్తుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ.. ఆమెకు సోషల్ మీడియా ద్వారా వెల్కం చెప్పింది.
హీరో విశాల్ మరదలు అయిన శ్రీయా రెడ్డి.. విక్రమ్ నటించిన ‘సమురాయ్’ అనే సినిమాతో నటిగా ప్రయాణం మొదలు పెట్టింది. ఆ తర్వాత తెలుగులో ‘అప్పుడప్పుడు’ అనే సినిమాలో నటించింది. ఇక విశాల్ నటించిన ‘పొగరు’ మూవీతో ఆమె రేంజ్ పెరిగిపోయింది. ఆ తర్వాత కూడా తెలుగు తమిళం మలయాళంలో ఎన్నో సినిమాల్లో ఆమె నటించి మెప్పించింది. ఇలా ఇప్పుడు ‘సలార్’లోనూ నటిస్తోంది.
‘OG’ మూవీలో సైతం శ్రీయా రెడ్డి ఓ పవర్ఫుల్ నెగెటివ్ రోల్నే చేస్తున్నట్లు అప్పుడే ప్రచారం మొదలైంది. దీంతో ఆమె పాత్రపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా క్రిస్మస్ కు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు