కేజీఎఫ్- 1, 2 సినిమాలతో హీరోయిన్‌గా నటించి.. అందరి దృష్టిని ఆకర్షించింది శ్రీనిధి శెట్టి. ఈ సినిమాల్లో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ బోలెడంత గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఈ గుర్తింపును క్యాష్ చేసుకోవాలనుకుందీ కన్నడ కుట్టి. అందులో భాగంగా తన రెమ్యునరేషన్‌ను రెట్టింపు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె కోబ్రా సినిమాతో తమిళంలో అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. కోలీవుడ్‌లో తొలి సినిమాకే ఆమె భారీ రేంజ్‌లో డిమాండ్ చేస్తోందట. కేజీఎఫ్ చాప్టర్ 2కు ఆమె మూడు కోట్లు తీసుకుంటే కోబ్రాకు ఏకంగా రూ.6-7 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్‌లో ఇది తనకు మొదటి సినిమా అయినప్పటికీ ఆ రేంజ్‌లో తీసుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సినీవిశ్లేషకులు. కాగా కోబ్రా సినిమాకు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. సెవన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్‌ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు.