HomeTelugu Trendingనెటిజన్ హాట్ ప్రశ్నకు శ్రీముఖి చిలిపి సమాధానం..!

నెటిజన్ హాట్ ప్రశ్నకు శ్రీముఖి చిలిపి సమాధానం..!

12a
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే హాట్ యాంకర్ శ్రీముఖి తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. కొన్ని కొంటె ప్రశ్నలకు చిలిపిగా సమాధానం చెప్పి అభిమానులను ఆనందాన్ని పంచింది. `మీరు లవ్‌లో ఉన్నారా?` అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు శ్రీముఖి స్పందిస్తూ.. `అవును` అని సమాధానం ఇచ్చింది. అలాగే `ఎవరైనా ముద్దుపెడతానంటే తిరస్కరించారా?` అని మరో వ్యక్తి అడిగితే.. `అవును.. ముద్దు వద్దని చెప్పాను` అంటూ రిప్లై ఇచ్చింది. అలాగే స్నేహితుడి నుంచి తప్పించుకునేందుకు కొన్నిసార్లు అబద్ధాలు చెప్పానని, పరీక్షల్లో చాలాసార్లు మోసం చేశానని శ్రీముఖి చెప్పుకొచ్చింది. మీరెప్పుడైనా దుస్తులు లేకుండా ఈత కొట్టారా ? అని అడిగితే.. ఎపుడూ ఈత కొట్టలేదని చిలిపిగా సమాధానమిచ్చింది. అలాగే అనుమతి లేకుండా పక్కవారి ఫోన్ చూడాల్సి వచ్చిందని, అది చాలా చెడ్డ అలవాటని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. బుల్లితెరపై హాట్ యాంకర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి ఇటీవల `బిగ్‌బాస్-3`తో మరింత పాపులర్ అయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu