దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పాతికేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా రూపొందించిన చిత్రం ‘పెళ్లిసందడి’. తెలుగు సినిమా చరిత్రలో ఓ సంచలనం సృష్టించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. అప్పటివరకు ఏవో సినిమాలు చేస్తూ వస్తున్న హీరో శ్రీకాంత్ కు ఒక్కసారిగా స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టింది.
మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అదే టైటిల్ తో రాఘవేంద్రరావు సినిమా చేయనున్నట్టు నిన్న వెలుడించారు. దీంతో ఈ చిత్రంలో హీరోగా ఎవరు నటిస్తారు అనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ పేరు బాగా వినిపిస్తోంది. ఆమధ్య నాగార్జున నిర్మించిన ‘నిర్మలా కాన్వెంట్’ అనే సినిమా ద్వారా టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రోషన్.
అయితే రాఘవేంద్రరావు కొత్త ‘పెళ్లిసందడి’కి రోషన్ ని హీరోగా ఎంచుకున్నట్టు చెబుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే కనుక, ఆనాడు తండ్రి శ్రీకాంత్ కు ఆ ‘పెళ్లిసందడి’ ఎంత గుర్తింపు తెచ్చిందో అదే స్థాయిలో రోషన్ కెరీర్‌కు ఈ ‘పెళ్లిసందడి’ కూడా అంతగానూ హెల్ప్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు.