తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్ తెలుగులో రీమేక్ చేయనున్నారు.. తమిళంలో అసురన్ సూపర్, డూపర్ హిట్ కావడమే కాదు.. ధనుష్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది… ఇక, మూవీని తెలుగులో రీమేక్ చెయ్యాలనే నిర్ణయానికి వచ్చిన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు.. రీమేక్ హక్కులను కూడా దక్కించుకున్నారు. అయితే, ఈ రీమేక్‌లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించబోతున్నారు. ఈ ప్రాజెక్టును దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తారనే టాక్ టాలీవుడ్లో నడిచింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. శ్రీకాంత్ అడ్డాల చేతికి ఈ సినిమా వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక, మూవీలో వెంకటేష్ సరసన అనుష్కను హీరోయిన్గా పెడితే బాగుంటుందనే యోచనలో ఉన్నారు మేకర్స్.. అయితే, దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుపుణుల, నటీనటులపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.