HomeTelugu Trendingఆ నటుడు హ్యాండ్‌ ఇవ్వడంతో విలన్‌గా మారిన అడ్డాల

ఆ నటుడు హ్యాండ్‌ ఇవ్వడంతో విలన్‌గా మారిన అడ్డాల

Srikanth Addala became actor for this reason

నిన్న రిలీజైన పెదకాపు-1 ట్రైలర్‌ ఓ రెంజ్‌లో నెటిజన్లు ఆకట్టుకుంటుంది. కుల రాజకీయాలతో అణచివేతకు గురవుతున్న ఓ గ్రామంలో వెనుకుబడిన కులానికి చెందిన ఓ కుర్రాడు వాళ్లకు ఎదురితిరిగి చేసిన పోరాటం ఎక్కడి వరకు తీసుకెళ్లిందని అరటి పండు ఒలిచి పెట్టినంత క్లారిటీగా సినిమా కాన్సెప్ట్‌ను ట్రైలర్‌లో వివరించారు. ఒక్క ట్రైలర్‌తోనే సినిమాపై హైప్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ఈ ట్రైలర్‌లో మరో ఆసక్తికర విషయమేంటంటే దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల ఓ కీలకపాత్రలో కనిపించడం.

ఆయన డైలాగ్స్‌ వింటే.. ఈ సినిమాలో ఈ పాత్ర కీలకం కాబోతున్నట్లు అర్థమైతుంది. నిజానికి అడ్డాల తను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేసినప్పుడే కొన్ని సినిమాల్లో అలా కెమెరా ముందు కనిపించి వెళ్లాపోయాడు. ఇక ఇప్పుడు ఏకంగా కీ రోల్‌ ప్లే చేయడమంటే విశేషమనే చెప్పాలి. ఇక ఈ సినిమా ట్రైలర్‌ ఈవెంట్‌లో తను నటుడిగా ఎందుకు మారాల్సి వచ్చిందో తెలిపాడు అడ్డాల. ముందుగా ఆ క్యారెక్టర్‌కు మలయాళ నటుడు, రోమంచమ్‌ ఫేమ్‌ శౌబిన్‌ షహీర్‌ను అనుకున్నామని. తను కూడా ఆ రోల్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని అడ్డాల వెల్లడించాడు. అయితే ఏమైందో తెలీదు కానీ అతను షూటింగ్‌కు రాలేదట, దాంతో అప్పటికప్పుడు మరో ఆర్టిస్టును వెతికే క్రమంలో తన అసోసియేట్ కిషోర్ ఆ క్యారెక్టర్‌ను తననే చేయమని ఒప్పించడంతో నటుడిగా అవతారమెత్తాల్సి వచ్చయిందని అడ్డాల చెప్పుకొచ్చాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu