1996లో కె. రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన ‘పెళ్లిసందడి’ సినిమా అప్పట్లో ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిన్న సినిమాగా నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఈ సినిమాతో హీరో శ్రీకాంత్ కెరీర్ మారిపోయింది. స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. వరుస సినిమాలలో నటించాడు.
తాజాగా ఈ సినిమాని అదే పేరుతో రాఘవేంద్రరావు సీక్వెల్ నిర్మిస్తున్నారు. ఆయన వద్ద పనిచేసిన గౌరి రోణంకి ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ గా పరిచయం అవుతోంది. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తారు. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తుండగా.. మలయాళ భామ మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తుంది. తాజా సమాచారం ప్రకరం ఈ సీక్వెల్ లో శ్రీకాంత్ కూడా ఓ కీలక పాత్రను పోషించనున్నట్టు తెలుస్తోంది. అంటే, తండ్రీకొడుకుల్ని ఒకే చిత్రంలో ప్రేక్షకులు చూడబోతున్నాం. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కె.కృష్ణమోహన్ రావుతో కలసి ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తోంది.