మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ గురించి తెలిసిందే. గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ.. కొన్నాళ్ల తరువాత తన మొదటి భర్తతో విడిపోయింది. తర్వాత కల్యాణ్‌దేవ్‌ను రెండో వివాహం చేసుకుంది. ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారని.. శ్రీజ త్వరలో మూడో పెళ్లి చేసుకోబోతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త ఏడాది సందర్భంగా శ్రీజ మరో కొత్త విషయాన్ని బయటపెట్టింది. 2023 ఏడాదిలో కొత్త వ్యక్తితో కొత్త ప్రయాణం మొదలైందని వెల్లడించింది.
‘డియర్ 2022.. నా జీవితంలో కొత్త వ్యక్తిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. నా గురించి బాగా తెలిసిన వ్యక్తి, నన్ను అమితంగా ప్రేమించే వ్యక్తి, కేరింగ్‌గా చూసుకుంటూ.. కష్ట, సుఖాల్లో తోడుండే వ్యక్తి, ఎప్పుడూ నాకు సపోర్ట్‌గా నిలిచే ఆ వ్యక్తి మరెవరో కాదు.. నేనే. ఈ ఏడాది నా గురించి నేను ఎక్కువగా తెలుసుకోవడం ఆనందంగా ఉంది. కొత్త ప్రయాణం మొదలైంది’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
https://www.instagram.com/reel/Cm6W06YB6U8/?utm_source=ig_web_copy_link