HomeTelugu NewsSRIDIVYA interview About RAYUDU

SRIDIVYA interview About RAYUDU

‘రాయుడు’లో నేను చేసిన భాగ్యలక్ష్మి క్యారెక్టర్‌ అందరికీ ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుంది 
– హీరోయిన్‌ శ్రీదివ్య 
బాల నటిగా కెరీర్‌ను స్టార్ట్‌చేసి మంచి నటిగా పేరు తెచ్చుకున్న శ్రీదివ్య ‘మనసారా’, ‘బస్‌స్టాప్‌’, ‘మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు’, ‘కేరింత’ వంటి హిట్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి కేవలం నాలుగు చిత్రాలతోనే సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అచ్చ తెలుగు అమ్మాయి శ్రీదివ్య. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా మాస్‌ హీరో విశాల్‌ సరసన శ్రీదివ్య హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం మే 27న అద్భుతమైన ఓపెనింగ్స్‌తో భారీగా రిలీజ్‌ అయింది. విశాల్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై ముత్తయ్య దర్శకత్వంలో రూపొందించిన ‘రాయుడు’ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందించారు. మే 20న తమిళంలో రిలీజైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ సాధించి సూపర్‌హిట్‌ అవ్వటమే కాకుండా రికార్డ్‌ కలెక్షన్స్‌ సాధిస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ శ్రీదివ్యతో జరిపిన ఇంటర్వ్యూ.
‘రాయుడు’ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది?
– చాలా చాలా మంచి రెస్పాన్స్‌ వస్తుందండీ. ఆల్‌రెడీ తమిళంలో ఈ సినిమా పెద్ద హిట్‌ అయింది. పది సంవత్సరాల తర్వాత విశాల్‌గారి కెరీర్‌లో భారీ ఓపెనింగ్స్‌తో రిలీజ్‌ అవ్వటమే కాకుండా యునానిమస్‌గా సూపర్‌హిట్‌ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. చెన్నైలో 2000 మంది కెపాసిటీ ఉన్న దేవి థియేటర్‌లో మొదటి మూడు రోజులు ప్రేక్షకులు హౌస్‌ఫుల్‌గా నిండిపోయి ఉన్నారు. దీన్నిబట్టి సినిమా ఏ రేంజ్‌ హిట్‌ అయిందో తెలుస్తుంది.
sridivya
స్పెషల్‌గా మీ క్యారెక్టర్‌కి ఎలాంటి అప్లాజ్‌ వస్తోంది? 
– ఈ చిత్రంలో భాగ్యలక్ష్మి క్యారెక్టర్‌ చేశాను. చాలా రఫ్‌ అండ్‌ టఫ్‌గా నా క్యారెక్టర్‌ ఉంటుంది. విలన్స్‌ వచ్చి తప్పుగా బిహేవ్‌ చేస్తే లాగిపెట్టి కొడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అబ్బాయిలా నా క్యారెక్టర్‌ ఉంటుంది. ఫస్ట్‌టైం విలేజ్‌ గర్ల్‌గా నటించాను. ఇప్పుడొస్తున్న ఫిలింస్‌లో హీరోయిన్‌ క్యారెక్టర్స్‌కి పెద్దగా ఇంపార్టెన్స్‌ ఉండడం లేదు. ఈ చిత్రంలో నేను చేసిన భాగ్యలక్ష్మి క్యారెక్టర్‌ చాలా బోల్డ్‌గా, స్ట్రాంగ్‌గా వుంటుంది. నా క్యారెక్టర్‌ మాత్రమే కాకుండా సినిమాలో ఉన్న ఉమెన్స్‌ క్యారెక్టర్స్‌ అన్నీ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. పర్టిక్యులర్‌గా భాగ్యలక్ష్మి క్యారెక్టర్‌ చూసి అమ్మాయిలందరూ ఇలాగే ఉండాలి అని ఇన్‌స్పైర్‌ అయ్యేవిధంగా ఉంటుంది. ఇంత మంచి క్యారెక్టర్‌ ఇచ్చిన విశాల్‌గారికి, డైరెక్టర్‌ ముత్తయ్య గారికి, హరి గారికి నా థాంక్స్‌.
విశాల్‌ గారితో వర్క్‌ చేయడం ఎలా అనిపించింది? 
– విశాల్‌గారి ‘వాడు వీడు’ నేను చేశాను. ఆ సినిమాలో విశాల్‌గారి పర్ఫామెన్స్‌ చూసి బాగా ఏడ్చేశాను. అంత బాగా పర్ఫామ్‌ చేశారు. డెఫినెట్‌గా ఆయనకి అవార్డు వస్తుందని అనుకున్నాను. కానీ రాలేదు. విశాల్‌గారితో యాక్ట్‌ చేయడం మర్చిపోలేని అనుభూతిని మిగిల్చింది. ఈ సినిమా చేసేటప్పుడు ఆయన ఎలా ఉంటారోనని ఫస్ట్‌ భయం వేసింది. సెట్లో అందరితో చాలా సరదాగా, క్లోజ్‌గా మూవ్‌ అయ్యేవారు. ఆయనతో వర్క్‌ చేయడం చాలా కంఫర్ట్‌బుల్‌గా ఫీలయ్యాను. ఈ సినిమాతో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. విశాల్‌గారు మంచి హ్యూమన్‌బీయింగ్‌. నడిగర్‌ సంఘానికి ఎంతో సేవ చేస్తున్నారు. అలాగే రాజపాళ్యంలో టాయిలెట్స్‌ కట్టించారు. నేను కూడా కొంత సాయం చేశాను. ఎక్కడ అన్యాయం, ఆపద జరిగినా చాలా ఫాస్ట్‌గా రియాక్ట్‌ అవుతారు విశాల్‌గారు.
దర్శకుడు ముత్తయ్య గారి టేకింగ్‌ గురించి? 
– భారతీరాజా, కె.విశ్వనాధ్‌ గారి చిత్రాలు ఎలా ఉంటాయో ముత్తయ్యగారి సినిమాలు కూడా చాలా నాచురల్‌గా, రియలిస్టిక్‌గా ఉంటాయి. ఆర్టిస్టులందరికీ ఎలా యాక్ట్‌ చేయాలో ముత్తయ్యగారు చేసి చూపించే వారు. అలాగే నేను ఆయన్ని ఫాలో అయి చేశాను.
తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు కదా. భాష ప్రాబ్లం ఏం రాలేదా? 
– నాకు ఫస్ట్‌ నుండే తమిళ భాష అంటే చాలా ఇంట్రెస్ట్‌. మెల్లమెల్లగా తమిళ్‌ సినిమాలు చేయడం వల్ల చాలా త్వరగా తమిళ భాష నేర్చుకున్నాను. తెలుగులో ఈ సినిమాకి నేనే డబ్బింగ్‌ చెప్పాను. ఇప్పుడు కంప్లీట్‌గా తమిళ్‌ మాట్లాడుతున్నాను.
ఈ సినిమా హిట్‌కి మెయిన్‌ రీజన్స్‌ ఏమిటి? 
– అమ్మమ్మ – మనవడు సెంటిమెంట్‌, ఎమోషనల్‌ డ్రామా అందరికీ కనెక్ట్‌ అయింది. అలాగే ఈ సినిమాలో వున్న ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్‌ ఉంది. అందరూ అద్భుతంగా పర్ఫామెన్స్‌ చేశారు. ముఖ్యంగా బామ్మ క్యారెక్టర్‌లో నటించిన మలయాళీ నటి లీలాగారు అద్భుతంగా చేశారు. ఇమామ్‌గారి మ్యూజిక్‌, వేల్‌రాజ్‌గారి ఫొటోగ్రఫి, ముత్తయ్యగారి టేకింగ్‌, విశాల్‌గారి పర్ఫామెన్స్‌ సినిమా హిట్‌కి మెయిన్‌ ఎసెట్‌గా నిలిచాయి.
నిర్మాత హరి బ్యానర్‌లో రెండు సినిమాలు చేశారు?
– హరిగారు డిస్ట్రిబ్యూటర్‌గానే కాకుండా నిర్మాతగా చాలా కేర్‌ తీసుకుని పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తో ‘రాయుడు’ చిత్రాన్ని ప్రాపర్‌గా రిలీజ్‌ చేశారు. మంచి టేస్ట్‌ ఉన్న నిర్మాత. పబ్లిసిటీ, ప్రమోషన్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా స్ట్రెయిట్‌ సినిమాలా ‘రాయుడు’ చిత్రాన్ని భారీగా రిలీజ్‌ చేశారు. హరిగారి బ్యానర్‌లో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది.
ఎక్కువగా తమిళంలోనే యాక్ట్‌ చేస్తున్నారు. తెలుగులో చేయరా? 
– మంచి రోల్స్‌ వస్తే తప్పకుండా తెలుగులో యాక్ట్‌ చేస్తాను. ‘కేరింత’ తర్వాత బాగా గ్యాప్‌ వచ్చింది. తమిళంలో మంచి ఆఫర్స్‌ వస్తున్నాయి. కంటిన్యూగా ఆ సినిమాలు చేస్తున్నాను. నాకు తెలుగులో చేయాలని ఉంది. మంచి ఆఫర్స్‌ వస్తే తప్పకుండా చేస్తాను. ‘రాయుడు’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయినందుకు చాలా సంతోషంగా వుంది.
నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌ ఏంటి? 
– కార్తీ, నయనతార జంటగా గోకుల్‌ దర్శకత్వంలో ‘కాష్మోరా’ చిత్రం చేస్తున్నాను. అదొక డిఫరెంట్‌ చిత్రం. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాను. అలాగే జీవాతో కలిసి ఒక సినిమాలో యాక్ట్‌ చేస్తున్నాను.
ఇమామ్‌ మ్యూజిక్‌ ఈ సినిమాకి ఎంతవరకు ప్లస్‌ అయింది? 
– ఇమామ్‌గారితో ఇది నా ఐదవ సినిమా. ఆయనతో వర్క్‌ చేయడం చాలా లక్కీగా ఫీలవుతున్నాను. ఎందుకంటే ఇళయరాజా గారి తర్వాత అంత మెలోడియస్‌గా హమ్‌చేసేలా సాంగ్స్‌ ఇస్తారు. ఈ సినిమాలో అన్ని పాటలు హిట్‌ అయ్యాయి. ‘ఒంటి జడ రోజా గుండె కెలికెరా’ పాటంటే చాలా ఇష్టం.
మీరు ఒక సినిమా కమిట్‌ అయ్యే ముందు దేనికి ప్రిఫరెన్స్‌ ఇస్తారు? 
– ఫస్ట్‌ డైరెక్టర్‌కి ఇంపార్టెన్స్‌ ఇస్తాను. ఆ తర్వాత కథ విని డిసైడ్‌ చేస్తాను. అలాగే నా క్యారెక్టర్‌కి చాలా ఇంపార్టెన్స్‌ వుండాలి. ఇప్పటి వరకు నేను చేసిన అన్ని సినిమాలు ఇంపార్టెన్స్‌ ఉన్నవే చేశాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు శ్రీదివ్య.

Recent Articles English

Gallery

Recent Articles Telugu