అతిలోక సుందరి శ్రీదేవి గతేడాది హఠాత్తుగా దుబాయ్ లోని ఓ హోటల్ లో బాత్ టబ్ లో అనుమాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. శ్రీదేవి ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన తార. కాగా, ఇప్పుడు ఈ అందాల తార శ్రీదేవి మైనపు విగ్రహాన్ని సింగపూర్ లోని మేడం టుస్సాడ్ మ్యూజియంలో పెట్టబోతున్నారు. సెప్టెంబర్ 4 వ తేదీన ఆమె విగ్రహాన్ని పెడుతున్నారు. బంగారు వర్ణంలో ఉండే దుస్తులతో ధగధగ మెరిసిపోతున్నది విగ్రహాం. విగ్రహానికి తుదిమెరుగులు దిద్దుతున్నారు.
దీనికి సంబంధించిన చిన్న వీడియోను బోనికపూర్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఎవరైనా సరే ఆ విగ్రహాన్ని చూస్తే.. అది నిజమైన విగ్రహం అని భ్రమపడటం గ్యారెంటీ. ఎందుకంటే విగ్రహం అంత అద్భుతంగా జీవకళ ఉట్టిపడేలా ఉన్నది.
Sridevi lives forever in not just our hearts but also in the hearts of millions of her fans. Eagerly waiting to watch the unveiling of her figure at Madam Tussauds, Singapore on September 4, 2019. #SrideviLivesForever pic.twitter.com/AxxHUgYnzt
— Boney Kapoor (@BoneyKapoor) September 3, 2019