అతిలోక సుందరి శ్రీదేవి మరణవార్త దేశాన్ని షాక్‌కు గురి చేసింది. 2018 ఫిబ్రవరి 24న.. బంధువుల వివాహ వేడుక కోసం దుబాయ్ వెళ్లిన ఆమె హోటల్ బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తుపడి మృతి చెందారు. ఆమె హఠాన్మరణంతో కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు శోకసంద్రంలో మునిగారు. అయితే శ్రీదేవి మరణానికి అసలు కారణం ఏంటనే సందేహాలు ఉన్నాయి. ఇటీవల సత్యార్థ్ నాయక్ అనే రచయిత శ్రీదేవి బయోగ్రఫీ రాసిన సంగతి తెలిసిందే. అందులో శ్రీదేవి మరణానికి కారణం ఏంటో చెప్పారు. శ్రీదేవి కుటుంబ సభ్యులు, సన్నిహితుల వద్ద సమాచారం సేకరించారు.
ఈ సందర్భంగా ఆంగ్ల మీడియాతో సత్యార్థ్ మాట్లాడుతూ.. ‘శ్రీదేవికి రక్తపోటు సమస్య ఉందని ‘చాల్బాజ్’ దర్శకుడు పంకజ్ పరాషర్, నాగార్జున నాతో చెప్పారు. గతంలో తమతో కలిసి సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో ఆమె బాత్‌రూమ్‌లో కళ్లుతిరిగి కిందపడ్డారని అన్నారు. ఆ తర్వాత శ్రీదేవి మేనకోడలు మహేశ్వరిని కలిశా. ఓసారి శ్రీదేవి బాత్‌రూమ్‌లో పడిపోయారని, ఆమె ముఖానికి గాయమై, రక్తం వచ్చిందని చెప్పారు. వాకింగ్‌లో పలుమార్లు శ్రీదేవి కుప్పకూలిపోయిందని బోనీ కపూర్ తెలిపారు. నేను రాసినట్లే ఆమె తక్కువ రక్తపోటుతో బాధపడుతున్నారు’ అని పేర్కొన్నారు.