టాలీవుడ్లో ‘బస్ స్టాప్’, ‘ఈ రోజుల్లో’ వంటి చిత్రాల్లో నటించింది నటి ఆనంది. తెలుగులో సక్సెస్ కాలేకపోయిన ఈ తెలుగమ్మాయి తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించింది. అక్కడ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదే సమయంలో తమిళ అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్ తో ప్రేమలో పడింది. ఈ జనవరి 7న పెద్దల అంగీకారంతో వరంగల్‌లో సోక్రటీస్ తో వివాహం జరిగింది. త్వరలోనే ఆమె తల్లి కాబోతోంది. ప్రస్తుతం ఆమెకు ఆరో నెల అని తెలుస్తోంది.
కాగా ఆనంది నటించిన రెండు తెలుగు సినిమాలు ఆమె పెళ్లి తర్వాత విడుదలయ్యాయి. వాటిలో ఒకటి ‘జాంబిరెడ్డి’ కాగా… మరొకటి సుధీర్ బాబు హీరోగా నటించిన ‘శ్రీదేవి సోడా సెంటర్’. మహేష్ బాబు కూడా మూవీపై ప్రశంసలు కురిపించారు. అయితే చిత్రంలో శ్రీదేవిగా నటించిన ఆనంది ప్రమోషన్స్‌లో కాని. ఇటు రిలీజ్ తర్వాత కాని ఎక్కడా కనిపించలేదు. తల్లి కాబోతున్నందునే ప్రమోషన్లకు రాలేకపోతున్నా అని చెప్పిందట.