శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ బాబుతో తాను రూపొందించనున్న సినిమా ద్వారా జాన్వీ కపూర్ ను టాలీవుడ్‌కు పరిచయం చేయాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమా కోసం ఆయన జాన్వీ కపూర్ ను సంప్రదించినట్టుగా చెబుతున్నారు. ఆమె అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్ ను కూడా రంగంలోకి దింపడానికి బోనీ కపూర్ సన్నాహాలు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే ఆమె అందాలకు మెరుగులు దిద్దుకోవడం .. నటనలో శిక్షణ తీసుకోవడం పూర్తయిందట. దాంతో ఆమెను కూడా వెండితెరకి పరిచయం చేయడానికి బోనీ కపూర్ సిద్ధమవుతున్నారట. ముందుగా బాలీవుడ్ కి ఆయన ప్రాధాన్యతను ఇచ్చాడట. కుదరకపోతే కోలీవుడ్ .. టాలీవుడ్ సినిమాలతోను ఆమెను పరిచేయం చేయనున్నాడనే వినికిడి. ఈ ఇద్దరిలో ముందుగా ఎవరు టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.