స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని కోడలు పై సంచలన నటి శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేసింది. తన హాట్ ఫొటో షూట్ కు సంబంధించిన ఫొటోలను ఇటీవల సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి స్పందిస్తూ.. సమంత డీసెంట్ గా కనిపించూ అంటూ హితవు పలికింది. అక్కినేని కుటుంబంలో అమలగారి వస్త్రధారణ ఎంతో హుందాతనంతో కూడి ఉంటుందని అన్నారు. కానీ, సమంత డ్రెస్సింగ్ తనకు ఏమాత్రం నచ్చడం లేదని చెప్పారు.
మహేష్ బాబు భార్య నమ్రతను చూసి సమంత నేర్చుకో అని శ్రీరెడ్డి హితవు పలికింది. హీరోగా మహేష్ సక్సెస్ వెనుక నమ్రత ఉన్నారని చెపింది. నీ భర్త నాగచైతన్య హీరోగా పెద్దగా సక్సెస్ కాలేకపోయాడని… ఆయన కెరీర్ ని నీవు చూసుకోవచ్చు కదా? అని అన్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా సరైన డ్రస్సులు వేసుకోవడం లేదని… అక్కినేని అభిమానులకు అది నచ్చడం లేదని వ్యాఖ్యానించారు. ఇకనైనా నాగచైతన్య జీవితం మీద, ఆయన కెరీర్ మీద దృష్టి సారించాలని సూచించింది.